VIDEO: ఎమ్మెల్యే కాళ్లపై పడ్డ దివ్యాంగ మహిళ
MHBD: పెన్షన్ ఇప్పించాలని కోరుతూ ఓ దివ్యాంగ మహిళ ఎమ్మెల్యే కాళ్లపై పడిన ఘటన MHBD జిల్లాలో జరిగింది. బయ్యారం మండలం రాయికుంటకు చెందిన మంజుల అనే దివ్యాంగురాలు పుట్టుకతోనే మూగ, చెవిటి. రెండేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో బుధవారం ఇల్లంద MLA కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకుంది. భర్త రెండేళ్ల క్రితం మరణించాడని, పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరింది.