రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై
GDWL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్‌బుక్)లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇవాళ రాజోలి ఎస్సై గోఖారి హెచ్చరించారు. కుల, మతాలకు సంబంధించి అసత్య ప్రచారాలు, మెసేజ్ ఫార్వర్డ్ చేసినా, పోస్ట్ చేసినా ఆ బాధ్యత గ్రూప్ అడ్మిన్లదే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.