నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ATP: కళ్యాణదుర్గంలో పలు సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఈనెల 13వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ జయకృష్ణ తెలిపారు. ఈ సమయంలో కళ్యాణదుర్గం, కుందుర్పి, శెట్టూరు, కంబదూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.