కల్తీ కల్లు బాధితులకు వేణురెడ్డి పరామర్శ

కల్తీ కల్లు బాధితులకు వేణురెడ్డి పరామర్శ

సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం చౌలూరులో కల్తీ కల్లుతో అస్వస్థతకు గురైన 10 మందిని మానస ఆసుపత్రిలో వైసీపీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి పరామర్శించారు. బాధితులు తమ సొంత డబ్బులతో చికిత్స పొందుతున్నారని, కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.