10నెలలు ఒకే సిలిండర్ సరిపోతుందా?: వరుదు కల్యాణి

KRNL: దీపం-2 పథకం రాష్ట్రంలో సరిగా అమలు చేయట్లేదని మండలిలో YCP ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. జూన్‌లో చంద్రబాబు సీఎం అయ్యారని, అప్పటి నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఒకే సిలిండర్ ఇస్తామనడం దారుణమన్నారు. 10నెలల పాటు ఒక కుటుంబం ఒకే గ్యాస్ సిలిండర్‌తో వంట చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం 2 సిలిండర్ల ఇస్తున్నారన్నారు.