అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సర్పంచ్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ భాగ్యమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, ప్రజలు ఏ సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలు మీవి.. పరిష్కారం మాది అనే నినాదంతో ముందుకువెళ్తానని తెలిపారు.