పెళ్లి వేడుకలో నవ్వులు పూయించిన లోకేష్

పెళ్లి వేడుకలో నవ్వులు పూయించిన లోకేష్

AP: పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి లోకేష్, ధూళిపాళ్ల కుమార్తెతో సరదాగా.. 'త్వరలో మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి.. రెడీగా ఉండు' అని వ్యాఖ్యానించారు. దీనికి ధూళిపాళ్ల నరేంద్ర స్పందిస్తూ.. 'మాకే ఎసరు పెడితే ఎలా బాబూ!' అని సరదాగా అనడంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు.