ఈ మార్గాల్లో ప్రయాణం నరకయాతనే

ఈ మార్గాల్లో ప్రయాణం నరకయాతనే

KMM: దానవాయిగూడెం- రామన్నపేట, పల్లెగూడెం- తీర్థాల ప్రధాన రహదారులు గుంతలుగా దర్శనమిస్తున్నాయని వాహనదారులు తెలిపారు. ఈ మార్గాల్లో గుండా ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నామని చెప్పారు. అటు అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నామని స్థానికులు అన్నారు. మంత్రి పొంగులేటి ఇలాకాలో ఈ దుస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.