గ్రీవెన్స్‌లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

గ్రీవెన్స్‌లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

KRNL: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తన నివాసంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను పరిశీలించి, కొన్నింటిని అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.