విష జ్వరాల సర్వే ముమ్మరం

విష జ్వరాల సర్వే ముమ్మరం

KMM: వేంసూరు మండలంలోని మర్లపాడు, లచ్చన్నగూడెం, భీమవరం, వేంసూరు, బీరాపల్లి గ్రామాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడ్డారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, ఆశా కార్యకర్తలతో ఇంటింటికీ జ్వరాల సర్వే, పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. అనారోగ్యంగా ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.