'సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం'
SRCL: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 218 దరఖాస్తుల రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలన్నారు.