నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఐదు అర్చక పోస్టులు ఖాళీగా ఉండగా దేవాదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా 41 మంది అభ్యర్థులు రాత, ఇంటర్వ్యూల కోసం దరఖాస్తులు చేయగా.. నేడు జరగాల్సిన పరీక్షలు అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఈఓ మహేశ్ తెలిపారు. సరస్వతి పుష్కరాల అనంతరం పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.