ఆర్డీటీకి FCRA లైసెన్స్ పునరుద్ధరణ

ఆర్డీటీకి FCRA లైసెన్స్ పునరుద్ధరణ

అనంతపురం జిల్లాలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థకు చెందిన FCRA లైసెన్స్‌ను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించింది. ఈ మేరకు లైసెన్స్ రెన్యూవల్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆర్డీటీ సేవలు అందిస్తోంది.