రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రజలు గమనించాలని కోరారు