'ఎల్లాపాటార్ గ్రామాన్ని అభివృద్థి చేస్తా'

'ఎల్లాపాటార్ గ్రామాన్ని అభివృద్థి చేస్తా'

ASF: ఎల్లాపాటార్ గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానని ఆ గ్రామ సర్పంచ్ పవార్ బాబులాల్ అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి ఎద్దడి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తానని తెలిపారు. రామునాయక్‌ తండా నుంచి ఎల్లాపాటార్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి, పూర్తయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.