కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

NGKL: లింగాల మండలంలోని ధారారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న దస్తగిరిని ప్రజలందరూ ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.