జన జాతర సభను జయప్రదం చేయాలి

జన జాతర సభను జయప్రదం చేయాలి

NLG: కుల రహిత సమానత్వ సమాజ స్థాపన కోసం ఈనెల 19న జిల్లాలోని టీఎన్జీఓ భవన్‌లో నిర్వహించే పూలే, అంబేద్కర్ 'జన జాతర'ను విజయవంతం చేయాలని కేవీపీఎస్ నేతలు వంటెపాక కృష్ణ, బొడ్డు బాబురావు, గాదే ఎల్లేష్ పిలుపునిచ్చారు. చిట్యాలలో దీనికి సంబంధించి కరపత్రాలను ఇవాళ విడుదల చేశారు. ఈ సాంస్కృతిక ఉత్సవంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వారు కోరారు.