పోలీస్ స్టేషన్ పక్కనే టవర్ ఎక్కిన వ్యక్తి

పోలీస్ స్టేషన్ పక్కనే టవర్ ఎక్కిన వ్యక్తి

SRPT: సూర్యాపేట పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న టవర్‌పైకి ఓ వ్యక్తి ఎక్కి హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వెంకట్, ఎస్సైలు ఏడుకొండలు, సాయిరాం, మహేందర్, శివ తేజ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తూ, సదరు వ్యక్తికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.