పాలకొండలో ముమ్మరంగా వాహన తనిఖీలు

పాలకొండలో ముమ్మరంగా వాహన తనిఖీలు

PPM: దేశరాజధాని ఢిల్లీలో బాంబ్ పేలుడు సంఘటన నేపథ్యంలో పాలకొండలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో వీరఘట్టం జంక్షన్లో సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో సీఐ ఎ.ప్రసాదరావు, ఎస్ఐ కె. ప్రయోగమూర్తి, సిబ్బంది ఉన్నారు