గ్రామాల్లో ఇంటింటి పలకరింపులు షురూ.!

గ్రామాల్లో ఇంటింటి పలకరింపులు షురూ.!

NLG: గ్రామాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ దాఖలు వేసిన అభ్యర్థులు ప్రచారాన్ని షురూ చేశారు. ఇవాళ ఆదివారం కావడంతో ప్రజలు ఇంటి వద్దే ఉంటారని భావించిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి 'అమ్మ ఎట్లున్నవ్', 'అయ్యా ఎట్లున్నవ్' 'అన్న ఎట్లున్నవ్' అంటూ పలకరిస్తున్నారు.