కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి: గోడం గణేష్

కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి: గోడం గణేష్

ADB: మావల మండల కేంద్రంలోని కొమరం భీం కాలనీలో దశాబ్ద కాలంగా నివసిస్తున్న ఆదివాసీలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని ఆదివాసి పోరాట హక్కుల తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. బుధవారం కాలనీవాసులతో సమావేశమై మాట్లాడారు. త్రాగునీరు విద్యుత్తు రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు.