రౌడీ షీటర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం

NTR: విజయవాడలో బుధవారం మధ్యాహ్నం డబుల్ మర్డర్ జరిగిన విషయం తెలిసినదే. ఈ ఘటనలో వెంకటరమణ, రాజు అనే వ్యక్తులు మృతి చెందారు. వీరిని కొత్తపేటకు చెందిన కిషోర్ అనే రౌడీషీటర్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రౌడీ షీటర్ కిషోర్ కోసం సౌత్ ఏసీపీ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. కిషోర్‌పై గతంలో ప్రజలను బెదిరించి నగదు లాకున్న కేసులు ఉన్నాయి.