జగన్‌పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు

PLD: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం చిలకలూరిపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉన్నాయని ఆయన అన్నారు. ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేసిన జగన్, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు.