మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..!

మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..!

MLG: రాజ్యాంగం ఇచ్చిన విలువైన ఓటును అమ్ముకోం. మా ఇంట్లో ఓట్లు అమ్మకానికి లేవు. గ్రామాభివృద్ధి చేసేవారికే ఓటేస్తాం అని చాటి చెబుతున్నారు. ములుగు మండలం సర్వాపురం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు గుండెబోయిన రావిగౌడ్. సంప్రదాయ మోకు ధరించిన ఆయన చేతిలో నినాదాలు రాసిన పోస్టర్‌ను ప్రదర్శిస్తూ తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశారు.