పిల్లలతోనే పాత్రలు తోమిస్తున్న టీచర్లు
రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ఓ ఘటన అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాక్సూ నం.1కు చెందిన ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం కింద విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను విద్యార్థుల చేతనే శుభ్రం చేయిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కాగా.. వాళ్ల చేత పాత్రను కాదని.. భవిష్యత్తును కడిగిస్తున్నారని మండిపడుతున్నారు.