VIDEO: శ్రీకాకుళంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆర్డీవో, వెలుగు గ్రామీణ అభివృద్ధి సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై మహిళా సాధికారతపై మాట్లాడారు.