కారులో చెలరేగిన మంటలు
కృష్ణా: హనుమాన్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిలో వీరవల్లీ ఫ్లైఓవర్ బ్రీడ్జి పై నిన్న ఒక కారులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చేశారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కారు ఎక్కువ భాగం కాలిపోయింది.