'సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోండి'

అన్నమయ్య: గృహ అవసరాలకు PM సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ సీజీఎం జానకిరామ్ కోరారు. రాజంపేట విద్యుత్ డివిజన్ కార్యాలయంలో ఈ పథకం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకానికి సబ్సిడీ ఇస్తుందని చెప్పారు.