సఖీవన్ స్టాప్ సెంటర్‌లో ఎస్పీ తనిఖీలు

సఖీవన్ స్టాప్ సెంటర్‌లో ఎస్పీ తనిఖీలు

BPT: బాపట్లలోని ఉప్పరపాలెం గేటు సమీపంలో ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ దూడి శుక్రవారం పరిశీలించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి వారు నిర్వహిస్తున్న విధులు, బాధిత మహిళలకు అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.