VIDEO: భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందించాలి: MLA
SKLM: భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. మంగళవారం అరసవల్లి దేవస్థానంలో నిత్యం జరుగుతున్న ఉచిత అన్న ప్రసాదాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు నాణ్యతతో రుచికరమైన భోజనాన్ని అందించాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.