రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు విద్యార్థి

KDP: రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి టి.చంద్రశేఖర్ ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పి.వెంకటలక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా కడపలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చంద్రశేఖర్ 58 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. కాగా, తమ పాఠశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ చూపడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.