'గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా HPV టీకా రక్షిస్తుంది'
ASF: వాంకిడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత హాజరై 9 -14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ వేశారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా బాలికలను టీకా రక్షిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బాలికకు ఈ టీకా అందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.