ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన

ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన

కృష్ణా: గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ వద్ద విద్యార్థులు మంగళవారం నిరసన చేపట్టారు. కళాశాల అసోసియేట్ డీన్ పీవీఎస్ కిశోర్ తమను వేధిస్తున్నారంటూ వారు ఆందోళనకు దిగారు. నిరసనలో భాగంగా పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఆందోళన విరమించబోమన్నారు.