మంత్రి అనుచరుడిపై కేసు నమోదు

మంత్రి అనుచరుడిపై కేసు నమోదు

వరంగల్ నగరంలోని 25వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్‌పై దాడి ఘటన కేసులో మంత్రి కొండ సురేఖ అనుచరుడు నవీన్ రాజ్‌పై ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ రాజ్ తీరుపై వాట్సాప్ గ్రూపుల్లో ఆడియోలు పెట్టినందుకు తనను కత్తితో బెదిరించి దాడి చేశారని బాధితుడు సాజిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని పై కేసు నమోదు చేశారు.