కమనీయంగా గోదా రంగనాథుల కళ్యాణం

కమనీయంగా గోదా రంగనాథుల కళ్యాణం

SRPT: సూర్యాపేటలోని భజన మందిరంలో ధనుర్మాస ముగింపును పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం వైభవంగా ఈరోజు జరిగింది. అర్చకులు ధరూరి సింగరాచార్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా వేడుక నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, గడ్డం వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.