తల్లిపాలలో బిడ్డకు అవసరమైన పోషకాలు

కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన కాలనీ అంగన్వాడీ కేంద్రం-3లో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ పిల్లా అనితా రామారావు, ఉపసర్పంచ్ లంక అజయ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా అనిత రామారావు మాట్లాడుతూ.. తల్లిపాలల్లో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయనీ, అలాగే వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుందని తెలియజేశారు.