విశాఖ వెళ్లి వృద్ధాప్య పింఛన్ అందజేత

VZM: గజపతినగరం మండలంలోని వేమలి గ్రామానికి చెందిన పున్నపురెడ్డి నారాయణమ్మ నడుముకు శస్త్ర చికిత్స చేయించుకుని విశాఖలో మంచం మీద ఉండడంతో వృద్ధాప్య పింఛను వెల్ఫేర్ అసిస్టెంట్ సతీష్, టీడీపీ నాయకులు కోరాడ మోహనరావులు వెళ్లి అందజేశారు. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.