ఆ రోడ్డులో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.!

ఆ రోడ్డులో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.!

ప్రకాశం: చీమకుర్తిలో శివారు ప్రాంతం ఒంగోలు-కర్నూలు రహదారిపై బహిరంగ చేపల అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రోజూ వందలాది వాహనాలు ప్రయాణించే రోడ్డు పక్కనే మార్కెట్ ఉండటం వల్ల చేపలను కోసిన వ్యర్థాలను అక్కడే పడి వేయటం వల్ల దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.