జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని వినతి

NLR: కావలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం వల్ల పేద విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోతున్నారని బీసీ ఐక్యత నాయకులు వరప్రసాదరావు, ప్రభాకర్, ఉరిటి గోవింద్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని వారు ఆర్డీవో ఎం. సన్నీ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపారు.