విశాఖలో ఐటీ సెక్రటరీ సమీక్ష
విశాఖ కలెక్టరేట్‌లో ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఇప్పటికే నడుస్తున్న ఐటీ పార్కులు, భవిష్యత్తులో రానున్న ఐటీ పార్కులు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు, డేటా సెంటర్ల ఏర్పాట్లపై చర్చించారు.