గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

NLR: వెంకటాచలం మండలంలోని కందలపాడు రోడ్డులో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 70 ఏళ్ల వయసున్న ఆమె నైటీ ధరించి ఉంది. ఎవరో వదిలివెళ్లిన తర్వాత చలికి తట్టుకోలేక మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.