ట్రైన్ నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

ట్రైన్ నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం: దొనకొండ వద్ద సోమవారం రాత్రి కొండవీడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ జనరల్ బోగీలో డోర్ వద్ద కూర్చున్న వ్యక్తి కిందపడ్డాడు. ప్రమాదవశాత్తు ట్రైన్ కింద కాళ్లు పడి ఎడమకాలు విరిగింది. వెంటనే తోటి ప్రయాణికులు రైలు ఆపి తిరిగి అదే రైలులో అతన్ని మార్కాపురం రైల్వే స్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రుడు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు చెందిన హరిబాబుగా గుర్తించారు.