పెద్దపల్లి జిల్లాతో జయశంకర్‌కు ప్రత్యేక అనుబంధం

PDPL: తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన జయశంకర్‌కి పెద్దపల్లి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. RGM, మంథని, PDPL, GDK ప్రాంతాల్లో నిర్వహించిన ఉద్యమ సభల్లో పాల్గొని విద్యార్థులను, ప్రజలను చైతన్య పరిచారు. ప్రత్యేక రాష్ట్ర అవసరం, ఆత్మగౌరవ భావనను వీరిలో నాటారు. విద్యా సమానత్వం, ప్రాంతీయ న్యాయం కోసం ఆయన ఇచ్చిన సందేశాలు జిల్లా వ్యాప్తంగా పోరాట పటిమ రగిలించాయి.