పెన్షన్లను పంపిణీ చేసిన కమిషనర్

పెన్షన్లను పంపిణీ చేసిన కమిషనర్

GNTR: ప్రతినెలా ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే పింఛన్ అందుతుండటంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం జీఎంసీ పరిధిలోని మాచిరాజువారి వీధిలో సచివాలయ కార్యదర్శులు చేపట్టిన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.