కృష్ణాయపాలెంలో వరి చేలను పరిశీలించిన కలెక్టర్
W.G: తాడేపల్లిగూడెం (M) కృష్ణాయపాలెంలో ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వరిచేలు నేలకొరిగింది. గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి వరిచేలును పరిశీలించారు. రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ నాగరాణి భరోసాని ఇచ్చారు.