భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కూలిన భారీ వృక్షం

భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కూలిన భారీ వృక్షం

ప్రకాశం: కంభం మండలంలోని రావిపాడులో భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ మర్రిచెట్టు వృక్షం అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆలయ ప్రాంగణంలో వందల ఏళ్లుగా నిలిచిన ఈ వృక్షం పాతదై బలహీనపడిన కారణంగా నేలమట్టం అయినట్లు గ్రామస్థులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటన సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెప్పారు.