VIDEO: భారీ వర్షాలతో నిండిన చెరువులు

BHPL: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. రేగొండ మండలంలోని దాదాపు అన్ని చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అవసరమైతేనే బయటికి రావాలని, చెరువులు, కుంటల వద్దకు పిల్లలను తీసుకెళ్లవద్దని, ఫొటోల కోసం నీటిలో దిగవద్దని శనివారం అధికారులు సూచించారు.