శ్రీ రామ పాదాన్ని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

NRPT: కోయిలకొండ మండలం రామకొండ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్‌లో నిలబడి దర్శనం చేసుకున్నారు. ఎంపీ డీకే అరుణ, నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్‌తో కలిసి స్వయంభు శ్రీరామ పాదాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాఘవేంద్రరావు వారికి వేదమంత్రోచనాలతో ఆశీర్వచనాలు అందజేశారు.