VIDEO: రేషన్ దుకాణాలకు మూడు నెలల రేషన్ బియ్యం
KMR: మద్నూర్ మండలంలోని రేషన్ దుకాణాలకు ఆదివారం నుంచి మూడు నెలల కోటా బియ్యం చేరుకుంటున్నట్లు డీలర్లు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మొత్తం 7,80,966 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి సరఫరా చేస్తోంది. ఈ బియ్యం పంపిణీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.