సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

ADB: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ పంటను అమ్మి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజా రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మార్కెట్ యార్డులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.